iDreamPost
android-app
ios-app

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతం పెంపు!

Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది.

Telangana Government: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు.ఉద్యోగులకు, నిరుద్యోగులకు వరుస శుభవార్తలు చెబుతూ వస్తుంది.

ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులకు జీతం పెంపు!

గత ఏడాది చివర్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ పథకాల హామీపై నమ్మకాన్న కల్పించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ అద్భుత విజయాన్ని కట్టుబెట్టారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపైనే చేయడం గమనార్హం. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు. వీటితో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్, రూ.500 లకే గ్యాస్ సిలండర్ పథకాలను అమలు చేస్తున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఆ ఉద్యోగులకు గొప్ప శుభవార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్ల జీతాల పెంపుపై రేవంత్ సర్కార్ దృష్టిపెట్టింది. ఉద్యోగ భద్రత, గౌరవ వేతనాల పెంపుపై 1,654 మందికి సంబంధించిన ప్రతిపాదన సిద్దం చేయాలని మంత్రి శ్రీధర్ బాబు అధికారులను ఆదేశించారు. మాజీ ఎమ్మెల్యే కలకం మృత్యుంజయం ఆధ్వర్యంలో గెస్ట్ లెక్చరర్ల సంఘం మంత్రి శ్రీధర్ బాబు ని కలిసి తమ సమస్యలను తెలిపారు. ప్రస్తుతం గెస్ట్ లెక్చరర్లకు రూ.28 వేల రూపాయలు వేతనం ఇస్తున్నారని.. దీన్ని రూ.42 వేలకు పెంచుతామని ఎన్నికల మెనిఫెస్టెలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు.

ఈ నేపథ్యంలోనే మంత్రి శ్రీధర్ బాబు ఈ అంశంపై దృష్టి సారించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశంను మంత్రి ఆదేశించారు. ప్రతిపాదితన ఫైల్ సిద్దమయ్యాక సీఎం రేవంత్ రెడ్డి తో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే రెగ్యూలర్ నియామకాలు జరుగుతున్నందున ఆ తర్వాత గెస్ట్ లెక్చరర్లను తొలగించకుండా సూపర్ న్యూమరరీ పోస్టులు ఏర్పాటు చేసే అంశంపై కూడా సీఎంతో చర్చిస్తామని శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. దీంతో ఎన్నాళ్ల నుంచో తమ వేతనం పెంపు విషయం పోరాడుతున్న గెస్ట్ లెక్చరర్లకు సంతోషంలో మునిగిపోయారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి