iDreamPost
android-app
ios-app

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త!

Telangana Government: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుుుంటున్నారు.

Telangana Government: గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి పరిపాలనలో తనదైన మార్క్ చాటుకుుుంటున్నారు.

నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త!

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగుతుంది. ఎన్నికల ముందు తెలంగాణ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల అమలుకు కృషి చేస్తుంది. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలతో పాటు రూ.500 లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ పథకాలు అమలు చేస్తుంది. తాజాగా నిరుద్యోగులకు రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త అందించారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తీపి కబురు అందించారు. ప్రభుత్వం నిర్వహించబోయే పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుద్యోగుల కోసం అంబేడ్కర్ నాలెడ్జ్ సెంటర్లను ప్రారంభిస్తామని తెలిపారు. ఆర్థిక ఇబ్బందులతో పోటీ పరీక్షలకు సిద్దమయ్యేందుకు ప్రైవేట్ ఇనిస్టిట్యూట్ కు వేళ్లలేని ఎంతో మందిన నిరుద్యోలు ఈ సెంటర్లు ఉపయోగపడతాయని ఆయన అన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మోంట్లలో అంబేద్కర్ నాలేడ్జ్ సెంటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్దమ చేస్తున్నామన్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్ లైన్ లో ఉచిత శిక్షణ ఇస్తామని తెలిపారు. కోచింగ్ ఇచ్చేందుకు విషయ పరిజ్ఞానం ఉన్న నిపుణులకు తీసుకుంటామని పేర్కొన్నారు.

హైదరాబాద్ కేంద్రంగా ఆన్ లైన్ పాఠాలు బోధిస్తారని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీ జాబ్ క్యాలెండర్ త్వరలో ప్రకటిస్తామని భట్టి విక్రమార్క తెలిపారు. వచ్చే నెల జరగబోయే గ్రూప్ – 2 పరీక్షలు వాయిదా వేయడంతో పాటు గ్రూప్ – 2, 3 పోస్టుల సంఖ్యను పెంచాలని గత కొంత కాలంగా ఆందోళన చేస్తొన్న నిరుద్యోగుల ఈ అంశంపై చర్చించేందుకు  రాష్ట సచివాలయంలో భట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన నిరుద్యోగులకు శుభవార్త చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి