iDreamPost
android-app
ios-app

Union Budget 2024: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్.. 10 లక్షల వరకు లోన్

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ లోక్ సభలో 2024-25కి సంబంధించిన బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి కబురును అందించారు. వారికి రూ. 10 లక్షల లోన్ అందించనున్నట్లు ప్రకటించారు.

Union Budget 2024: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మాలా సీతారామన్ లోక్ సభలో 2024-25కి సంబంధించిన బడ్డెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తీపి కబురును అందించారు. వారికి రూ. 10 లక్షల లోన్ అందించనున్నట్లు ప్రకటించారు.

Union Budget 2024: విద్యార్థులకు కేంద్రం గుడ్ న్యూస్..  10 లక్షల వరకు లోన్

ప్రతిభ ఉండి కూడా డబ్బు లేని కారణంగా చదువుకు దూరమవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగాలేక చదువుకోవాలన్నా కోరికను చంపుకుంటున్నారు. ఒక వ్యక్తి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకువెళ్లేది కేవలం విద్య మాత్రమే. మరి అంతటి ప్రాధాన్యత ఉన్న విద్య అందరికి అందాలని.. ప్రతి ఒక్కరు విద్యావంతులు కావాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులకు ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది. స్టూడెంట్స్ ఉన్నత విద్య కోసం రూ. 10 లక్షల వరకు లోన్ అందించనున్నట్లు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో వెల్లడించారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ లో 2024-25కి సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ లో విద్యారంగానికి భారీగా నిధులు కేటాయించారు. విద్యార్థులకు ఆర్థికంగా చేయూతనందించేందుకు వారికి లోన్స్ అందించేందుకు కీలక ప్రకటన చేశారు నిర్మలా సీతారామన్. దేశీయంగా ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు రూ. 10 లక్షల వరకూ లోన్ అందిస్తామని ప్రకటించారు. కేంద్రం నిర్ణయంతో ఉన్నత విద్యానభ్యసించాలనుకునే వారికి భారీ ఊరట లభించినట్లైంది. లక్షలాది మంది విద్యార్థులకు లబ్థి చూకూరనున్నది. నిరుద్యోగులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా స్కిల్ డెవలప్ మెంట్ రంగాలకు చేయూతనిచ్చే విధంగా ప్రత్యేక పథకాలను ప్రకటించారు.

విద్యార్థులకు లోన్ అందించేందుకు మోడల్ స్కిల్ లోన్ స్కీమ్ లో సవరణలు చేశారు. ప్రతి సంవత్సరం అర్హులైన విద్యార్థులకు లోన్స్ అందించనున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. అయితే ఈ ఎడ్యుకేషన్ లోన్ అనేది దేశీయ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వారికి మాత్రమే ఈ స్కీమ్ వర్తించనున్నట్లు తెలిపారు. విద్యార్థులకు 3 శాతం వడ్డీతో రూ. 10 లక్షల లోన్ అందిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు. దేశీయ విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడమే లక్ష్యంగా విద్యార్థులకు లోన్స్ అందించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి