ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అనుచరుడు సూరీడుపై హైదరాబాద్‌లో దాడి జరిగింది. జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించిన అల్లుడు డాక్టర్ సురేంద్రనాథ్ క్రికెట్ బ్యాట్‌తో సూరీడుపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు సూరీడు కుమార్తె గంగా భవానీకి సురేంద్రనాథ్‌కు కొన్నాళ్ల క్రితం వివాహమైంది. అప్పటి నుంచి దంపతుల మధ్య మనస్పర్థలు మొదలయ్యాయి. భర్త వేధింపులు భరించలేక భవానీ పుట్టింటికి వచ్చేసింది. అతడిపై గృహ హింస కేసు పెట్టింది. కేసు వెనక్కి […]