తెలంగాణలో ఇద్దరు ఎమ్మెల్యేలు కరోనా వైరస్ బారిన పడ్డారు. జనగాం ఎమ్మెల్యే యాదగిరి రెడ్డి, నిజమాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్థన్లకు వైరస్ సోకిందని నిర్థారణ అయింది. వీరిద్దరూ అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ ఓఎస్డీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఈటెల హోం క్వారంటైన్లోకి వెళ్లారు. లాక్డౌన్ సమయంలో తెలంగాణలో వైరస్ నియంత్రణలోకి వచ్చినట్లు కనిపించగా.. ఆ తర్వాత లాక్డౌన్ సడలింపులతో వైరస్ వ్యాప్తి […]
కరోనా ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా సోకుతుంది. తమిళనాడు ఎమ్మెల్యే అన్బళగన్ కరోనా వైరస్ సోకడం వల్ల చనిపోవడం తమిళనాడు రాజకీయాల్లో పెద్ద కుదుపుగా చెప్పుకోవచ్చు. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా సోకినట్లుగా నిర్దారణ కావడంతో హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్యేతో పాటుగా ఆయన ఇంట్లో మరో నలుగురికి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో పాటుగా ఆయన భార్య, గన్మెన్, వంటమనిషి, డ్రైవర్కు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. […]