దేశ రాజధాని ఢిల్లీ వణికిపోతోంది. ఈ సారి శీతాకాలంలో చలికి ఢిల్లీ ప్రజలతోపాటు అన్నదాతల ఉద్యమానికి రాజకీయ నాయకులు కూడా వణకాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ రంగంలో కొత్తగా తెచ్చిన మూడు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ అన్నదాలు ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయడకుండా గత 20 రోజులుగా ఢిల్లీ సహరిద్దుల్లో నిరసన వ్యక్తం చేస్తున్నారు. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. కొత్త చట్టాలను రద్దు చేసే వరకూ ఉద్యమం ఆపేది లేదని భీష్మించుకూర్చున్నారు. […]