ఒకప్పుడు ఆ రాష్ట్రం కాంగ్రెస్.. ఆ తర్వాత కమ్యూనిస్టులకు కంచుకోట. కానీ ఇప్పుడు జల్లెడ పట్టి వెతికినా వాటి ఉనికి కనిపించని దుస్థితి. పశ్చిమ బెంగాల్లో ఇంతకాలం అధికారం లేకపోయినా కొన్ని సీట్లయినా గెలిచి చట్టసభల్లో తమ వాణి వినిపిస్తూ ఉనికి చాటుకుంటున్న ఆ పార్టీలకు తొలిసారి అసెంబ్లీలో ప్రాతినిధ్యం దక్కని పరిస్థితి ఏర్పడింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడ్డాయి. ఈసారి కాంగ్రెస్, వామపక్షాలు కలిసి సంయుక్త మోర్చా పేరుతో పోటీ చేసినా […]