ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్నారు వలంటీర్లు. నిజంగా వలంటీర్ అన్న పదానికి న్యాయంచేస్తూ ప్రజలకు స్వచ్ఛందంగా సేవలు అందిస్తున్నారు. కరోనా అంటే భయంకరమైన వైరస్ గా ప్రచారం జరిగిన రోజుల్లో కూడా వలంటీర్లు ప్రజల మధ్యనే నిలిచారు. ప్రాణాలకు తెగించి వారి అవసరాలను తీర్చారు. మహమ్మారి బారిన పడినవారి బాగోగులను కూడా చూసుకున్నారు. వారికి తక్షణం ప్రభుత్వ సేవలు అందేలా చేయడంలో ముందు వరుసలో నిలిచారు. కరోనా పరీక్షలు చేయడంలో ఏపీ దేశంలోనే […]