విశాఖ రాంకీ ఫార్మా సిటీలో భారీ పేలుళ్లు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి సమయంలో ఫార్మా సిటీలో వరుస పేలుళ్లు చోటుచేసుకున్నాయి. భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. రాంకీ సీఈటీపీలోని సాల్వెంట్ ఫార్మా కంపెనీలో, పరవాడలోని జవహర్లాల్ నెహ్రూ ఫార్మసిటీలో అగ్నిప్రమాదం సంభవించాయి. వరుసగా పేలుళ్లు జరుగుతుండడంతో అగ్నిమాపక శకటాలు ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్లలేకపోతున్నాయి. మంటలు ఎగసి పడుతుండడంతో అగ్నిమాపక సిబ్బంది కూడా ఏమీ చేయలేకపోతున్నారు. భారీ పేలుళ్లతో ఫార్మా సిటీ చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు […]