విశాఖ ఉక్కు కర్మాగారంలో ప్రభుత్వ పెట్టుబడులను వంద శాతం ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో కేసు దాఖలైంది. ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీ నారాయణ మంగళవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 2015 నుంచి నష్టాలు వస్తున్నాయన్న సాకుతో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం తగదని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్లాంట్ ను లాభాల బాటలోకి మళ్లించేందుకు పలు ప్రత్యామ్నాయ మార్గాలు […]