ఏపీలో రాజకీయాలు భలే గమ్మత్తుగా ఉంటున్నాయి. ప్రభుత్వం ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలులో విఫలమైతే ప్రతిపక్షం రోడ్డెక్కుతుంది. ధర్నాలు, ఆందోళనలతో హడావిడి చేస్తుంది. ఏ రాష్ట్రంలోనైనా అదే జరిగేది. కానీ ఇక్కడ ప్రతిపక్షం పాత్ర.. పాత్రకు తగ్గట్లుగా ఉండడం లేదని విమర్శల పాలవుతోంది. బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు అయితే దాన్నో పాఠంగా ఎక్కడ సమావేశం జరిగినా వల్లె వేస్తుంటారు. ఒక్క ఎమ్మెల్యే లేకపోయినా తామే ప్రతిపక్షమని ధైర్యంగా ప్రకటిస్తారు కూడా. అందుకు కారణం టీడీపీ అనుసరిస్తున్న […]