తెలంగాణలో ఉప ఎన్నిక ఫలితం తేలిపోయింది. నాగార్జునసాగర్ లో గులాబీనే గెలుపు వరించింది. నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ ఎమ్మెల్యే అయ్యారు. 18, 449 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. టీఆర్ఎస్ శ్రేణులు మొదటి నుంచి చెబుతున్నట్లుగా 20 వేల మెజారిటీకి చేరువ అయ్యారు. టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు వ్యూహాలు ఫలించాయి. అభ్యర్థి ఎంపిక నుంచి గెలుపొందే వరకూ ఆయన ప్రతీ రోజూ ఎన్నికల సరళిని నిశితంగా గమనిస్తూ శ్రేణులకు దిశా నిర్దేశం చేస్తూ వచ్చారు. ఉప […]
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఖాతా తెరిచింది. యూసఫ్గూడలో కారు పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి రాజ్కుమార్ పటేల్ జయకేతనం ఎగురవేశారు. మేయర్ స్థానాన్ని గెలుచుకుంటామనే ధీమాతో ఉన్న ఆ పార్టీకి కౌంటింగ్ ఫలితాలు అనుకూలంగానే వస్తున్నాయి. ప్రస్తుతం ఆ పార్టీ 52 డివిజన్లలో ఆధిక్యంలో కొనసాగుతోంది. మొత్తం 150 డివిజన్లకు గాను ఇప్పటి వరకు టీఆర్ఎస్ 52 డివిజన్లలో ఆధిక్యంలో ఉండగా.. ఒక డివిజన్లో గెలిచింది. బీజేపీ 20 డివిజన్లలో ఆధిక్యంలో […]