పశ్చిమ బెంగాల్లో బీజేపీ సహా ప్రతిపక్షాలకు మున్సిపల్ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురైంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ జోరును తట్టుకోలేక ఆ పార్టీలు పూర్తిగా చతికిల పడ్డాయి. ఆ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మమతాబెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ పార్టీ దాదాపు క్లీన్ స్వీప్ చేసింది. మొత్తం 108 మున్సిపాలిటీల్లో 103 పురపాలక సంఘాల్లో టీఎంసీ జైత్రయాత్ర సాగించింది. బీజేపీ, కాంగ్రెసులకు ఒక మున్సిపాలిటీ అయినా దక్కలేదు. లెఫ్ట్ ఫ్రంట్ ఒక్క పురపాలక సంఘాన్ని చేజిక్కించుకోగా మూడుచోట్ల […]
దేశంలోనే అతి సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. పశ్చిమ బెంగాల్లో చివరి విడత పోలింగ్ చెదురుమదురు ఘటనల మధ్య గురువారం జరిగింది. సాయంత్రం 5.30 సమయానికి అందిన సమాచారం ప్రకారం 76 శాతం ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది విడతల్లో జరిగిన ఈ ఎన్నికల్లో ప్రతి దశలోనూ భారీ పోలింగ్ నమోదు కావడం విశేషం. దేశవ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రక్రియను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించినా.. మిగతా రాష్ట్రాలు ఒక ఎత్తు.. బెంగాల్ ఒక ఎత్తు అన్నట్లు […]