ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికల సందడి కొనసాగుతోంది. తెలంగాణాలో దుబ్బాక ఉప ఎన్నిక ఆ రాష్ట్ర అధికార పార్టీకి వ్యతిరేకంగా రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రత్యర్ధి పార్టీలు వైఎస్సార్సీపీకి తిరుపతి పార్లమెంటరీ స్థానంలో వ్యతిరేకమైన ఫలితాల కోసం ఆశతో ఎదురు చూస్తున్నాయి. అందులో భాగంగానే తమ వాస్తవ శక్తికి మించి ప్రకటనలతో మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. వీటిని పరిశీలిస్తున్న రాజకీయ వర్గాలు, ప్రస్తుతం ఏపీలో ప్రత్యర్ధి పార్టీలుగా ఉన్న తెలుగుదేశం, బీజేపీ–జనసేనలు కొరివితో తల […]