ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల సమానాభివృద్ధికి మూడు రాజధానులను ప్రకటించిన వైసీపీ సర్కార్.. తన లక్ష్యానికి అనుగుణంగా వెళుతోంది. మరో వైపు అమరావతినే ఏకైక రాజధానిగా చేయాలంటూ అమరావతి ప్రాంతంలోని కొన్ని గ్రామాల్లో ఉద్యమాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మూడు రాజధానులు అంశంపై కోర్టుల్లో దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సాగుతోంది. లక్ష కోట్లు ఒకచోటే పెట్టాలా..? రాష్ట్రంలోనూ మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందేలా నిర్ణయాలు తీసుకోవాలా..? అనే అంశంపై గత ఏడాదిగా చర్చ సాగుతోంది. రాష్ట్ర ప్రజలు మూడు రాజధానులకే […]
‘అమరావతి కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం’.. అంటూ కమ్యూనిస్టు పార్టీ జాతీయకార్యదర్శి కె. నారాయణ ఎదుటివారి గుండెలదిరించే స్టేట్మెంటొకటి ఇచ్చేసారు. ఆయన ఉన్న పార్టీ మౌలిక సిద్ధాంతాలనే మర్చిపోయారో లేక ‘మనస్సు’లో ఉన్న నాయకులకు మంచి చేయాలనుకునే తాపత్రయ పడ్డారో గానీ నారాయణ ఇచ్చిన ఈ స్టేట్మెంట్ ఇప్పుడు భారీగానే ట్రోల్ అవుతోంది. అభివృద్ధి అందరికీ, అన్ని ప్రాంతాలకీ సమానంగా అందాలన్న సిద్ధాంతాన్నే కమ్యూనిస్టు పార్టీలు చెబుతుంటాయి. ఆ పార్టీలో ఉన్న నారాయణ మాత్రం అందుకు భిన్నంగా కామెంట్లు […]
ప్రాంతాల మధ్య అసమానతలకు అభివృద్ధి కేంద్రీకరణ ప్రధాన కారణం. ఒకే రాష్ట్రంలోని వేరు వేరు ప్రాంతాల మధ్య అసమ అభివృద్ధి ప్రజల్లో అసంతృప్తికి కారణంగా మారుతుంది. ఫలితంగా ప్రాంతీయ ఉద్యమాలు అనివార్యమవుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుభవాలు చెప్తున్న పాఠాలివి. రాష్ఱ్ర విభజనకు మూలంగా నిలిచింది కూడా అసమ అభివృద్ధే. మరోమారు ప్రజల్లో అలాంటి అసంతృప్తికి అవకాశం కల్పించకూడదనుకుంటే అన్ని ప్రాంతాల అభివృద్ధిపైనా ప్రభుత్వాలు దృష్టిసారించాల్సి ఉంటుంది. ఆ దిశలో అడుగులు వేస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణకు […]