టాలీవుడ్‌కు జులై నెల బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి మూడు వారాలు ‘సామజవరగమన’, ‘బేబీ’ లాంటి చిన్న సినిమాలు తెలుగు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ఈ రెండు మూవీస్ మంచి హిట్స్‌గా నిలిచాయి. తక్కువ బడ్జెట్లో తెరకెక్కి కలెక్షన్లలో దుమ్మురేపాయి. ముఖ్యంగా ‘బేబీ’ అయితే స్టార్ హీరోల సినిమాల రేంజ్లో వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ పండితులను కూడా షాక్‌కు గురి చేసింది. ఈ నెల చివరి వారం అంతా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌దే హవా. మేనల్లుడు […]
ఒక భాషలో బ్లాక్ బస్టర్ అయిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లోనూ అదే ఫలితాన్ని దక్కించుకుంటుందన్న గ్యారెంటీ లేదు. గుడ్డిగా రీమేక్ రైట్స్ కొనేసి చకచకా తీసేయడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటో ఇకపై దర్శక నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. ఎందుకనేది చూద్దాం. ఇటీవలే రిలీజైన ఓరి దేవుడాలో వెంకటేష్ ప్రత్యేక క్యామియో చేసినప్పటికీ, ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన అశ్విన్ మరిముత్తుకే దర్శకత్వ బాధ్యతలు ఇచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయింది. […]
చాలా రోజుల తర్వాత ఏ పెద్ద సినిమా లేని ఓ శుక్రవారం దొరకడంతో చిన్న సినిమాలు మూకుమ్మడి దాడి చేయబోతున్నాయి. నవంబర్ 4న ఏకంగా తొమ్మిది సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అల్లు శిరీష్ ఊర్వశివో ‘రాక్షసివో’ అందులో మొదటిది. తమిళ రీమేక్ గా రూపొందిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ షూటింగ్ ఎప్పుడో పూర్తయ్యింది. బయటికి చెప్పని కారణాల వల్ల ఆలస్యం చేసుకుంటూ వచ్చారు. ఆహాకు యాక్టింగ్ పార్ట్ నర్ గా మారిపోయిన బాలకృష్ణను ముఖ్యఅతిథిగా […]
‘ఆర్ఆర్ఆర్’ (RRR)కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికాలో హాలీవుడ్ చిత్రాలకు ఇచ్చే శాటర్న్ అవార్డు ఈ ఏడాది ఈ చిత్రానికి వరించింది.ఉత్తమ అంతర్జాతీయ సినిమా విభాగంలో ఈ అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా జ్యూరీకి కృతజ్ఞతలు చెబుతూ రాజమౌళి (Rajamouli) వీడియో సందేశాన్ని పంపించారు. ”బెస్ట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ కేటగిరీలో మా సినిమా అవార్డు దక్కించుకున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. మా టీమ్ అందరి తరఫు నుంచి జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు. ‘బాహుబలి – 2’ తర్వాత […]
మాములుగా సినిమాల్లో హీరో హీరోయిన్ల పాత్రలను ఫలానా వృత్తులకే పరిమితం చేయడం రెగ్యులర్ గా చూస్తుంటాం. అప్పుడెప్పుడో ముప్పై ఏళ్ళ క్రితం చిరంజీవి చెప్పులు కుట్టేవాడిగా స్వయంకృషిలో, బెస్తవాడిగా ఆరాధనలో, ఫ్యాక్టరీ లేబర్ గా ఘరానా మొగుడులో కనిపించడం తప్పించి ఈ మధ్య కాలంలో కొత్త జెనరేషన్ స్టార్లు అలాంటి సబ్జెక్టులు చేయలేకపోతున్నారు. కమర్షియల్ గా వర్కౌట్ అవ్వదేమోననే అనుమానమే వాళ్ళను వెనక్కు లాగుతోంది. అయితే అసలు ఎలాంటి క్యాస్టింగ్ ఆకర్షణలు లేకుండా కేవలం కంటెంట్ ని […]
ఎక్కడలేని విధంగా ఒక్క తెలుగులోనే వారానికి అయిదుకి పైగా సినిమాలు విడుదలవుతున్నాయి. తమిళం హిందీలోనూ అతి కష్టం మీద ఒకటి రెండు రిలీజ్ చేయగలుగుతున్నారు కానీ టాలీవుడ్ తరహాలో ఇంకెక్కడా దూకుడు కనిపించడం లేదు. అలా అని మన థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డుతో కళకళలాడుతున్నాయనుకుంటే వేడి సాంబార్ లో కాలేసినట్టే. ఎందుకంటే నెంబర్ ఘనంగానే ఉంది కానీ టికెట్ కౌంటర్ల దగ్గర కలెక్షన్ల పర్వం మాత్రం అదో రకంగానే సాగుతోంది. అంతో ఇంతో పేరున్న హీరోల […]
మూడు నెలలకు పైగా గ్యాప్ తర్వాత తెరుచుకున్న థియేటర్లకు రెండో శుక్రవారం వచ్చేసింది. లాస్ట్ వీక్ చెప్పుకోదగ్గ స్థాయిలో తిమ్మరుసు మాత్రమే పర్వాలేదనిపించేలా వసూళ్లు తేగా ఇష్క్ మాత్రం ఫ్లాప్ ముద్ర నుంచి తప్పించుకోలేకపోయింది. రేపు ఏకంగా ఆరు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాయి. అందులో ఎక్కువగా ఆకర్షిస్తున్న చిత్రం ‘ఎస్ఆర్ కల్యాణమండపం’. కేవలం ఒక్క సినిమా అనుభవం మాత్రమే ఉన్న కిరణ్ అబ్బవరం హీరోగా నూతన దర్శకుడు శ్రీధర్ గాదె రూపొందించిన ఈ లవ్ ఎంటర్ […]
గత రెండు రోజులుగా పేరున్న మీడియా సంస్థల ఛానళ్ళు, పత్రికల్లో కరోనా థర్డ్ వేవ్ గురించిన వార్తలు కాస్త గట్టిగానే వస్తున్నాయి. ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాయి తప్ప ఒకవేళ నిజంగా ఆ ప్రమాదం ముంచుకొస్తుందా లేదా అనే క్లారిటీ ఇవ్వడం లేదు. ఆ మాటకొస్తే దీని గురించి తలలు పండిన వైద్య శాస్త్రవేత్తలు కూడా ఏమి చెప్పలేని పరిస్థితి కాబట్టి గవర్నమెంట్ ని నిందించి లాభం లేదు. వ్యాక్సిన్ వేసుకోవడం, బయటికి వెళ్తే ఒళ్ళు దగ్గర […]
1987లో వచ్చిన ఆడదే ఆధారం అప్పట్లో పెద్ద హిట్టు. స్టార్లు లేకుండా కేవలం ఫ్యామిలీ ఎమోషన్స్, మధ్యతరగతి కష్టాలను ఆధారంగా తీసిన ఆ సినిమా కొన్నిసెంటర్లలో వంద రోజులు ఆడింది. సగటు మిడిల్ క్లాస్ క్లాస్ వాడిగా కాపురాలు తీర్చిదిద్దే వాడిగా అందులో నటించిన విసు గారు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తర్వాత శ్రీమతి ఒక బహుమతి, ఇల్లు ఇల్లాలు పిల్లలు లాంటి మంచి హిట్స్ ఈయన ఖాతాలో ఉన్నాయి. విసు గారి గురించి ఇప్పుడు […]
సెవెన్ సమురాయ్ (1954) కంటే ముందే అలాంటి కథాంశంతో తెలుగులో సినిమా వచ్చింది. అది పల్లెటూరి పిల్ల (1950). ఊళ్ల మీద పడి దోచుకునే కంపన్న దొరకి వ్యతిరేకంగా ప్రజలకి హీరో ఎన్టీఆర్ శిక్షణ ఇస్తాడు. సెవెన్ సమురాయ్ పక్కాగా ఇదే పాయింట్‌పై నడుస్తుంది. అయితే పల్లెటూరి పిల్లలో ట్రయాంగిల్ లవ్‌స్టోరీతో త్యాగం, ఉపదేశాలు, పరివర్తన ఇలా చాలా కలిసిపోయి కథని తేలిక చేసేస్తాయి. ఈ సినిమాలో ఫస్ట్ సీనే అద్భుతంగా ఉంటుంది. ఊరి మీద పడి […]