iDreamPost

ఈ వారం థియేటర్స్.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

  • Author singhj Published - 04:04 PM, Mon - 31 July 23
  • Author singhj Published - 04:04 PM, Mon - 31 July 23
ఈ వారం థియేటర్స్.. ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే..!

టాలీవుడ్​కు జులై నెల బాగా కలిసొచ్చిందనే చెప్పాలి. మొదటి మూడు వారాలు ‘సామజవరగమన’, ‘బేబీ’ లాంటి చిన్న సినిమాలు తెలుగు బాక్సాఫీస్​ను షేక్ చేశాయి. ఈ రెండు మూవీస్ మంచి హిట్స్​గా నిలిచాయి. తక్కువ బడ్జెట్​లో తెరకెక్కి కలెక్షన్లలో దుమ్మురేపాయి. ముఖ్యంగా ‘బేబీ’ అయితే స్టార్ హీరోల సినిమాల రేంజ్​లో వసూళ్లను కొల్లగొట్టి ట్రేడ్ పండితులను కూడా షాక్​కు గురి చేసింది. ఈ నెల చివరి వారం అంతా పవర్ స్టార్ పవన్ కల్యాణ్​దే హవా. మేనల్లుడు సాయి ధరమ్ తేజ్​తో కలసి ఆయన నటించిన నటించిన ‘బ్రో’ మూవీ మంచి వసూళ్లతో దూసుకెళ్తోంది.

ఈ వారం కూడా ఆడియెన్స్​ను అలరించడానికి పలు సినిమాలు, వెబ్​ సిరీస్​లు రెడీ అవుతున్నాయి. వీటిలో కొన్ని నేరుగా థియేటర్లలో విడుదల అవుతుండగా.. మరికొన్ని మాత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. బిగ్​ స్క్రీన్స్​లో రిలీజ్ కానున్న మూవీస్​లో స్టార్ క్రికెటర్ ధోని నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న ‘ఎల్​జీఎం’ కూడా ఉంది. ఈ వారం థియేటర్/ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు, వెబ్​ సిరీస్​లు ఏంటో ఇప్పడు తెలుసుకుందాం..

థియేటర్లలో విడుదల కానున్న సినిమాలు:

ఎల్​జీఎం – ఆగస్టు 4
కృష్ణగాడు అంటే ఓ రేంజ్ – ఆగస్టు 4
దిల్ సే – ఆగస్టు 4
రాజు గారి కోడి పులావ్ (కుటుంబ కథా ‘వి’చిత్రం) – ఆగస్టు 4
మెగ్​ 2 (రాక్షస తిమింగళం) – ఇంగ్లీష్, హిందీ, తెలుగు – ఆగస్టు 4
బ్లడ్ & చాక్లెట్ – ఆగస్టు 4
ప్రియమైన ప్రియ – (ఈ వారమే రిలీజ్)
హెబ్బులి – ఆగస్టు 4
మిస్టేక్ – ఆగస్టు 4
విక్రమ్ రాథోడ్ – ఆగస్టు 4

ఓటీటీలో విడుదల అవుతున్న సినిమాలు/వెబ్​ సిరీస్​లు:

డిస్నీ ప్లస్ హాట్​స్టార్

దయా (తెలుగు వెబ్ సిరీస్) – ఆగస్టు 5
గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ 3 (ఇంగ్లీష్ ఫిల్మ్) – ఆగస్టు 4

నెట్​ఫ్లిక్స్

రంగబలి (తెలుగు) – ఆగస్టు 4
చూనా (హిందీ వెబ్ సిరీస్) – ఆగస్టు 3
ది హంట్ ఫర్ వీరప్పన్ (డాక్యుమెంటరీ సిరీస్) – ఆగస్టు 4

అమెజాన్ ప్రైమ్ వీడియో

ధూమం (తెలుగు, కన్నడ వెర్షన్)

సోనీలివ్

పరేషాన్ (తెలుగు చిత్రం) – ఆగస్టు 4

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి