iDreamPost

IMDB టాప్-250 ఇండియన్ మూవీస్​.. లిస్ట్​లోని తెలుగు సినిమాలు ఇవే..!

  • Published Dec 29, 2023 | 6:04 PMUpdated Dec 29, 2023 | 6:04 PM

రేటింగ్స్, రివ్యూస్​లో పేరు గాంచిన ఐఎండీబీ సంస్థ నుంచి టాప్-250 ఇండియన్ మూవీస్ లిస్ట్ రిలీజైంది. ఇందులో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

రేటింగ్స్, రివ్యూస్​లో పేరు గాంచిన ఐఎండీబీ సంస్థ నుంచి టాప్-250 ఇండియన్ మూవీస్ లిస్ట్ రిలీజైంది. ఇందులో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Dec 29, 2023 | 6:04 PMUpdated Dec 29, 2023 | 6:04 PM
IMDB టాప్-250 ఇండియన్ మూవీస్​.. లిస్ట్​లోని తెలుగు సినిమాలు ఇవే..!

ఈ రోజుల్లో సినీ ప్రేక్షకులు చాలా సెలక్టివ్​గా ఉంటున్నారు. కరోనా తర్వాత థియేటర్లకు వెళ్లడం కాస్త తగ్గించారు. బజ్ ఉన్న మూవీస్​తో పాటు పాజిటివ్ మౌత్ టాక్ తెచ్చుకున్న సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పెద్ద హీరోల సినిమాలు, క్రేజీ కాంబినేషన్​లో వచ్చే ఫిల్మ్స్, స్టార్ డైరెక్టర్స్ తీసే చిత్రాలను బిగ్ స్క్రీన్స్​లో చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. కానీ యావరేజీగా నిలిచే మూవీస్​ను అంతగా పట్టించుకోవడం లేదు. థియేటర్​లోనే కాదు ఓటీటీల్లో కూడా మంచి రివ్యూలు, రేటింగ్స్, హిట్ టాక్ తెచ్చుకున్న వాటికే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అందుకోసం ఐఎండీబీ రేటింగ్స్​ లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా రేటింగ్స్, రివ్యూస్​కు అత్యంత ప్రామాణికంగా  ఐఎండీబీని భావిస్తుంటారు. అలాంటి ఈ సంస్థ తాజాగా టాప్-250 ఇండియన్ మూవీస్ లిస్ట్​ను విడుదల చేసింది. ఇందులో ఉన్న తెలుగు సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

యూజర్లు ఇచ్చిన రేటింగ్స్ ఆధారంగా టాప్ 250 ఇండియన్ మూవీస్ లిస్ట్​ను తయారు చేసింది ఐఎండీబీ. ఆ వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ జాబితాలో టాలీవుడ్ నుంచి పలు సినిమాలకు చోటు దక్కింది. అందులో సూపర్​స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళితో పాటు యంగ్ హీరో అడవి శేష్​లవి చెరో మూడు చిత్రాలు ఉండటం విశేషం. టాలీవుడ్ టాప్ ర్యాంక్ మాత్రం కేరాఫ్ కంచరపాలెం (14వ స్థానం) దక్కించుకుంది. ఆ తర్వాత ర్యాంకుల్లో వరుసగా జెర్సీ (19), మాయాబజార్ (23), సీతారామం (26), నువ్వు నాకు నచ్చావ్ (37), ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ (50), సత్య (51), మహానటి (54), బాహుబలి కంక్లూజన్ (109), బొమ్మరిల్లు (128) ఉన్నాయి.

మెగాస్టార్ రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ మూవీ ఐఎండీబీ ర్యాంకుల్లో 135వ ప్లేస్​లో నిలిచింది. మహేష్ ‘అతడు’ (142), విజయ్ దేవరకొండ ‘పెళ్లిచూపులు’ (150) స్థానాల్లో ఉన్నాయి. వీటి తర్వాతి పొజిషన్స్​లో ‘క్షణం’ (159), ‘ఎవరు’ (165), ‘మేజర్’ (176), ‘వేదం’ (184), ‘బాహుబలి బిగినింగ్’ (191), ‘అర్జున్ రెడ్డి’ (200), ‘పోకిరి’ (220), ‘ఒక్కడు’ (223), ‘ఊపిరి’ (227), ‘మనం’ (229), ‘లీడర్’ (232), ‘ఆర్ఆర్ఆర్’ (236), ‘హ్యాపీడేస్’ (240) ఉన్నాయి. ఐఎండీబీ లిస్టులో తెలుగు నుంచి ఇన్ని సినిమాలకు చోటు దక్కడం గొప్ప విషయమే. కానీ పలు క్లాసిక్ మూవీస్​ మాత్రం ఆ లిస్టులో లేకపోవడం గమనార్హం. దీనికి కారణం ఐఎండీబీ అనేది నెటిజన్స్.. అందులోనూ ఆ వెబ్​సైట్ పై అవగాహన ఉన్నవాళ్లు మాత్రమే రేటింగ్స్ ఇవ్వడం. మరి.. ఐఎండీబీ టాప్-250లో ఏ తెలుగు సినిమాకు చోటు దక్కి ఉంటే బాగుండేదని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: Isha Koppikar: విడాకులు తీసుకోబోతున్న నాగార్జున హీరోయిన్..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి