‘‘పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే నారా చంద్రబాబునాయుడికి కార్యకర్తలు గుర్తుకు వస్తారు’’ ఇది ప్రత్యర్ధులు అనే మాటలు కాదండోయ్.. ఆయన సొంత పార్టీలోనుంచే నాయకుల నోటి నుంచి తరచు విన్పించే మాటే ఇది. గతంలో ఎంతో మంది ఇదే చెప్పారు.. మధ్యలోనూ పలువురు ఆవేదన చెందారు.. ఇప్పుడు కూడా ఇదే మాట అంటున్నారట ఆ పార్టీ నాయకులు. అందేంటి రాష్ట్ర కార్యవర్గంలో ఏకంగా 300 మందికి అవకాశం కల్పిస్తే అలా అనడమేంటి అన్నడౌటు మీకు సహజంగానే రావొచ్చు. […]
ఇటీవల టీడీపీ కేంద్ర కమిటీ, పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులను నియమించిన ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు రాష్ట్ర కమిటీని ప్రకటించారు. రాష్ట్ర అధ్యక్షులతోపాటు కమిటీని ప్రకటించాల్సి ఉన్నా.. కసరత్తు కొలిక్కి రాలేదనే కారణంతో వాయిదా వేశారు. తాజాగా 219 మంది నేతలతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్ర కమిటీలో 18 మంది ఉపాధ్యక్షులు, 16 మంది ప్రధాన కార్యదర్శులు, 18 మంది అధికార ప్రతినిధులు, 58 కార్యనిర్వాహక కార్యదర్శులు, […]