గత నెలలో బాలబొమ్మ వెంకటేశ్వరరావు, తాజాగా కలిశెట్టి అప్పలనాయుడు.. టీడీపీ పొలిటీబ్యూరో సభ్యుడు కిమిడి కళా వెంకటరావు అధికార దర్పానికి వరుసగా సీనియర్ నేతలు బలవుతున్నారు. తనను ప్రశ్నించేవారిని, తనకు వ్యతిరేకంగా ఉన్నారన్న అనుమానం ఉన్న వారిని సస్పెన్షన్ల పేరుతో కళా సాగనంపుతుండటం శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గ టీడీపీలో ప్రకంపనలు రేపుతోంది. నేతల సస్పెన్షన్లకు చూపుతున్న కారణాలు కూడా కళా వైఖరినే తప్పు పడుతున్నాయి. గత రెండేళ్లుగా కళా తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎచ్చెర్ల […]