గ్రేటర్ పీఠం సాధించేందుకు పార్టీలన్నీ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ తీవ్రంగా కనిపిస్తోంది. మరోవైపు గతంలో జీహెచ్ఎంసీ పై జెండా ఎగురవేసిన కాంగ్రెస్ ఈసారి కూడా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఆయా పార్టీలకు చెందిన నాయకులు, స్టార్ క్యాంపెయినర్స్ రోడ్ షోలు, పాదయాత్రలతో దూసుకెళ్తుంటే మరో పార్టీ తెలుగుదేశం లో విచిత్ర పరిస్థితి కనిపిస్తోంది. 106 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టినప్పటికీ వారి తరఫున నిలబడి పోరాడేవారు కరువయ్యారు. నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసినీ […]