ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఎన్నికల రాజకీయాలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. 36 వార్డులకు గాను టీడీపీ ఇక్కడ 18 వార్డులను గెలుచుకోవడంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. ఎక్స్ అఫిషియో ఓట్లతో అధికార వైసీపీ చైర్మన్ పీఠాన్ని గెలుచుకుంటుందని భావించగా.. అందుకు తాజాగా మున్సిపల్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలతో దారులుమూసుకుపోయాయి. మున్సిపల్ చైర్మన్ ఎన్నిక కోసం వైసీపీ ఎమ్మెల్సీలు మహ్మద్ ఇక్బాల్, శమంతకమణి, గోపాల్ రెడ్డిలు, టీడీపీ […]