బలమే జీవనం బలహీనతే మరణం అన్నట్టి స్వామి వివేకానందుల ప్రవచనంలో ఈవాక్యం చిన్నదైనా అందులోని అర్ధం అనంతమైనది. 1863 సంవత్సరంలో జనవరి నెల12 వ తేదీ సోమవారం కలకత్తాలో పుణ్యదంపతులైనట్టి విశ్వనాధ దత్తా భువనేశ్వరిలకు స్వామి వివేకానందుల వారు జన్మించారు. ఆయనకు తల్లిదండ్రులు నరేంద్రుడు అని పేరు పెట్టారు. బాల్యం నుండి ఆయనలో ధైర్య సాహసాలు, నిరుపమాన దీక్షాశక్తి ఎక్కువగానే ఉన్నాయి. కళాశాలలో చదువుతుండగా తన తండ్రిగారు మరణించటంతో కుటుంబ భారం ఆయనపైన పడినది.దత్త కుటుంబీకులు సంఘంలో గొప్ప […]