ఇప్పటికే మెగా మేనల్లుడు 1 రూపంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా సెటిలైపోయాడు. మొదటి సినిమా రేయ్ దారుణంగా దెబ్బ తిన్నప్పటికీ పిల్లా నువ్వు లేని జీవితంతో బోణీ కొట్టేసి ఆ తర్వాత సుప్రీమ్ తో కుదురుకున్నాడు. ఆ మధ్య వరసగా ఆరు డిజాస్టర్లతో మార్కెట్ ని ఇబ్బందుల్లో పాడేసుకున్న తేజుకి చిత్రలహరి కొంత ఊరటనివ్వగా ఏడాది చివర్లో వచ్చిన ప్రతి రోజు పండగే మళ్ళీ ట్రాక్ లో పడేసింది. హిట్ అయితే చాలు అనుకుంటే ఏకంగా […]