తిరుమల తిరుపతి దేవస్థానం బొక్కసం నుండి నగలు మాయమైన మాట వాస్తవమేనని అధికారులు నిగ్గు తేల్చారు. అదృశ్యమైన ఆభరణాలు పునఃపరిశీలనలో కూడా దొరకలేదని అధికారులు నిర్ధారించారు. దీనిపై టిటిడి అధికారులు శాఖాపరమైన చర్యలకు ఉపక్రమించారు. తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఆలయాలకు అనాదిగా భక్తులు మొక్కులు, కానుకల రూపంలో సమర్పించే ఆభరణాలను పరిశీలించి తిరువాభరణం (రికార్డు) లో నమోదు చేసి బొక్కసం (ట్రెజరీ) భద్రపరుస్తారు. అయితే 2016 లో బొక్కసం ఏఈఓ గా ఉన్న శ్రీనివాసులు బదిలీ […]