మునక ప్రాంత ఊర్ల, రైతుల పరిస్థితులెలా ఉంటాయో చూడాలని చాలా రోజుల్నుంచి అనుకుంటున్నా గానీ ఎక్కడా కుదరట్లేదు. శ్రీశైలం వెళ్లే అవకాశాలు చాల తక్కువ అదే సోమశిల అయితే పక్కనే ఒక గంట మనది కాదనుకుంటే వెళ్లి చూసి రావొచ్చు. అలా ఎన్నో రోజుల నుండి మనసులో ఉన్న ఆలోచనలు కాస్తా కరోనా దెబ్బకు ఒక రూపుదిద్దుకున్నాయి. సోమశిల బ్యాక్ వాటర్లో మునిగి తమ అస్థిత్వాన్ని కోల్పోయి పేరుకు మాత్రమే మిగిలున్న బైగ్గారి పల్లె, మలినేటి పట్నం, […]