హాజీపూర్ హత్యల కేసులో పోక్సో స్పెషల్ కోర్టు ఈ రోజు గురువారం సంచలన తీర్పు వెలువరించింది. సీరియల్ కిల్లర్ శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. హాజీపూర్ హత్యలకు సంబంధించిన మూడు కేసుల్లోనూ శ్రీనివాస్‌రెడ్డిని దోషిగా కోర్టు నిర్ధారించింది. ముగ్గురు చిన్నారి బాలికలపై అత్యాచారం జరిపి.. శ్రీనివాస్‌రెడ్డి అత్యంత దారుణంగా చంపేసిన విషయం పోలీసు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ హత్యలు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చినీయాంశమయ్యాయి. యాదాద్రి జిల్లా బొమ్మలరామారం మండలం హాజీపూర్ […]