సోనియా గాంధీ అంతరంగీకుల్లో ఒకరిగా గుర్తింపు పొందిన అహ్మద్ పటేల్ మరణించారు. గుజరాత్ కి చెందిన ఈ కీలక నేత సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలో చక్రం తిప్పారు. 71 సంవత్సరాల పటేల్ సోనియా గాంధీకి వ్యక్తిగత రాజకీయ కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో రాజకీయంగా కీలక పాత్ర పోషించారు. యూపీఏ వ్యవహారాల్లో ప్రధాన భూమిక నిర్వహించారు. తెలంగాణా ఆవిర్భావం వంటి అంశాలలో ఆయన అభిప్రాయం మూలంగా మారింది. నెల రోజుల క్రితం ఆయన కరోనా బారిన పడ్డారు. […]