నెల్లూరు కార్పొరేషన్‌కు ఈ సారి ప్రత్యేకంగా ఎన్నికలు జరగబోతున్నాయి. ఓటర్ల జాబితా సరిగా లేకపోవడం వల్ల ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో నెల్లూరు నగర పోరు జరగడం లేదు. కోర్టు కేసులు రెండుమూడు నెలల్లో పరిష్కారమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత నెల్లూరు నగర పోరు జరగబోతోంది. ఇప్పుడే కాదు నెల్లూరు మున్సిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారినప్పటి నుంచి ఇదే పరిస్థితి. దాదాపు 120 సంవత్సరాలపాటు మున్సిపాలిటీగా ఉన్న నెల్లూరు 2004లో కార్పొరేషన్‌గా మారింది. కొన్నేళ్లు […]