ఆన్లైన్ వ్యాపారం విస్తృత మయ్యాక ప్రతీ వస్తువును అక్కడినుంచే తెప్పించుకోవడం అలవాటు బాగా పెరిగింది. హెయిర్ పిన్ను మొదలకుని తినే ఆహారం వరకు కొనుక్కునేందుకు ఇప్పుడు అనుసరిస్తున్నది ఆన్లైన్ విధానమే. జనానికి సౌలభ్యం పెంచుతుండడంతో దీనికి లభిస్తున్న ఆదరణ ఏ రోజుకారోజు పెరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు విద్రోహశక్తులకు కూడా ఇదే అవకాశం కాబోతుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆన్లైన్ ద్వారా వచ్చే వస్తువులు ఏ మాత్రం ఉపయోగపడకపోయినా వాటిని తిరిగి పంపించడమో, పక్కన పడేయమో చేస్తుంటారు. […]