రాజద్రోహం చట్టంపై సుప్రీంకోర్టు సంచనల ఉత్తర్వులు వెలువరించింది. ఇప్పటివరకూ ఉన్న రాజద్రోహం కేసులపై స్టే విధించింది. ఈ చట్టాన్ని ప్రస్తుతానికి నిలుపదల చేస్తున్నట్లు బుధవారం నాటి తీర్పులో వెల్లడించింది. రాజద్రోహం చట్టం కింద అరెస్టయిన వాళ్లంతా బెయిల్ పిటిషన్ పెట్టుకోవచ్చని సూచించింది. అంతేకాదు, రాజద్రోహం చట్టం కింద కొత్తగా ఎలాంటి కేసులు నమోదు చేయవద్దని తేల్చేసింది. రాజద్రోహం కేసుకు సంబంధించిన చట్టాలను పునః పరిశీలించాలన్న సుప్రీం కోర్టు, సెక్షన్ 124A కింద నమోదైన కేసులన్నింటినీ తిరిగి విచారించాలని […]