ఏలూరులో అంతుచిక్కని విధంగా ప్రజలు అస్వస్థతకు గురికావడానికి కారణమేంటన్న దానిపై అన్వేషణ కొనసాగుతోంది. స్థానికంగా జరిపిన అన్ని పరీక్షల్లోనూ ఎటువంటి తేడాలు కన్పించకపోవడంతో సీసీయంబీ, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, న్యూ ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ తదితర ఉన్నత స్థాయి పరిశోధన సంస్థల సాయాన్ని కూడా కోరారు. ఏలూరులోని పలు ప్రాంతాలు, వ్యాధి భారిన పడ్డవారి నుంచి శాంపిల్స్ను సేకరించి ఆయా సంస్థలకు పంపించినట్లు వైద్య ఆరోగ్య శాఖాధికారులు స్పష్టం చేసారు. సోమవారం అర్ధరాత్రి వరకు […]