కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైరస్ కట్టడికి ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. వైరస్ బారిన పడేవారి సంఖ్య మళ్లీ పెరుగుతుండడంతో ఈ రోజు విద్యాశాఖ మంత్రి, అధికారులతో సీఎం వైఎస్జగన్ సమీక్ష నిర్వహించారు. అన్ని అంశాలను పరిశీలించిన తర్వాత.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పాఠశాలలను మూసివేసేందుకు నిర్ణయించారు. ఇంటర్, పదో తరగతి మినహా మిగతా అన్ని తరగతుల క్లాస్లులను రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈ ఏడాది […]