ఏపీలో ఈ ఏడాది జులై 5వ తేదీ నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ఎస్ సీ ఈఆర్టీ అకడమిక్ క్యాలెండర్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జులై 5వ తేదీ నుంచి 2023 ఏప్రిల్ 29వ తేదీ వరకూ పాఠశాలలు జరగనున్నాయి. పాఠశాలలకు ఉండే మూడు స్థానిక సెలవులను ఉపయోగించుకుంటే.. వాటి స్థానంలో అదే నెలలో రెండో శనివారం, ఆదివారం పాఠశాలలను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి ఏటా జూన్ 12వ తేదీ […]
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా విద్యార్థులందరినీ ఆంగ్ల మాధ్యమానికి సంసిద్ధులను చేయడం కోసం ప్రారంభించిన “వారధి” కార్యక్రమంనకు ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది.ఈ నెల 16వ తేదీన విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించడానికి బేస్ లైన్ టెస్ట్ (వారధి ప్రారంభం పరీక్ష) ప్రైవేట్ పాఠశాలలు మినహా అన్ని రకాల యాజమాన్య ప్రాథమిక పాఠశాలలో నిర్వహించడం జరిగింది. వారధి ప్రారంభం పరీక్షలో తెలుగు,గణితంలో 8 మార్కుల కన్నా తక్కువ పొందినవారు ఒకటో స్థాయి, తెలుగు గణితంలో 8 కన్నా ఎక్కువ, […]