రాష్ట్రమంతా మున్సిపల్ ఎన్నికల వేడి ఉంది. వీధి వీధినా ప్రచారాల హోరుతో మార్మోగుతోంది. కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అంటూ కొత్త కొత్త అభ్యర్థులు జనం వద్దకు వచ్చి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. భారీగా డబ్బు ఖర్చు పెడుతున్నారు. అసలు వారు గెలిస్తే వచ్చేది ఏమిటి? వీరికి ప్రభుత్వం ఏమైనా జీతాలు ఇస్తుందా? ఇస్తే అది ఎంత మొత్తం ఉంటుందో అన్నది చాలా మందికి తెలియదు. గౌరవ వేతనం ఉంటుంది మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన కార్పొరేటర్లు, మేయర్లు కౌన్సిలర్లు, మున్సిపల్ ఛైర్మన్ […]