సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా అందులోనూ రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత వస్తోందంటే అభిమానులకే కాదు సాధారణ ప్రేక్షకులకు సైతం ఉత్సాహం ఉండటం సహజం. దానికి తోడు కళావతి పాట చార్ట్ బస్టర్ కావడం, పోకిరి రేంజ్ లో ఉంటుందని యూనిట్ పదే పదే ఊరించడం లాంటివి అంచనాలను పెంచేశాయి. ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గానే కనిపించడంతో బుకింగ్స్ జోరందుకున్నాయి. పర్లేదనే టాక్ వస్తే చాలు బాక్సాఫీస్ ని తన కంట్రోల్ లోకి తీసుకునే ప్రిన్స్ […]