సొంత పార్టీపై విమర్శలు చేసినందుకు కాంగ్రెస్ అధికార ప్రతినిధిపై వేటు పడింది. సోనియా గాంధీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి పదవి నుంచి సంజయ్ ఝాను తొలగించారు. ఓ పత్రికలో పార్టీని విమర్శిస్తూ ఆయన వ్యాసం రాయడంతో అధిష్ఠానం ఈ చర్యకు దిగింది. ‘‘సంజయ్ ఝాను ఏఐసిసి అధికార ప్రతినిధి పదవి నుంచి వెంటనే తొలగిస్తూ సోనియా గాంధీ ఆదేశాలు జారీ చేశారు’’ అని పార్టీ ప్రకటించింది. అంతేకాక అభిషేక్ దత్, సాద్నా భారతిలను జాతీయ మీడియా ప్యానలిస్టులుగా నియమిస్తూ […]