పట్టణ ఎన్నికల్లో హేమాహేమీలైన తెలుగుదేశం పార్టీ నాయకులకు భంగపాటు తప్పలేదు. ప్రజలు ఏకపక్షంగా ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేయడంతో రిజల్ట్స్ వెల్లడి మొదలైనప్పటి నుంచే సదరు నాయకులు, వారి అనుచరుల్లో నైరాశ్యం అలముకుంది. ముఖ్యంగా ఏపీలో అతిపెద్ద జిల్లాగా పేరుపొందిన తూర్పుగోదావరి జిల్లా నుంచి టీడీపీలో కీలక నాయకులుగా ఎదిగిన వారి పరిస్థితి మరింత దారుణంగా మారింది. జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా అత్యధిక కాలం పనిచేసిన నిమ్మకాయల చినరాజప్పకు ఆయన ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం పరిధిలోని […]