రెండువారాలుగా సాయిపల్లవి విరాటపర్వం సినిమాను భుజానికెత్తుకొని ప్రచారం చేస్తున్నారు. మీడియాతో మాట్లాడారు. ఇంటర్వ్యూలిచ్చారు. విరాటపర్వం సినిమాలో తన పాత్ర వెన్నెల గురించి ఎమోషనల్ అయ్యారు. వారం రోజులుగా ఆమె ట్రెండింగ్ ఉన్నారు. కాని గ్రేటాంద్రకిచ్చిన ఇంటర్వ్యూ మాత్రం వివాదస్పదమైంది. కశ్మీర్లో పండితులను చంపడం, ఆవు పేరుతో ముస్లింలను చంపడం , హింసపరంగా ఈ రెండింటి మధ్య తేడా ఏముందని విరాటపర్వం హీరోయిన్ ప్రశ్నించారు. ఒకటి రెండు రోజులు ఈ వ్యాఖ్యలను వివాదస్పదం చేస్తున్నారు. సాయిపల్లవిపై చర్యలు తీసుకోవాలంటూ […]