తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయమని ఇటీవల బీజేపీ నేతలు ప్రకటిస్తున్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపు తర్వాత ఆ ప్రకటనలనే బలంగా వినిపిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ మేయర్ సీటు కోసం టీఆర్ఎస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. గ్రేటర్‌ను తాము గెలుస్తామంటే.. తాము గెలుస్తామని ఇరు పార్టీల నేతలు ప్రకటిస్తూ రాజధానిలో ఎన్నికల వేడిని రాజేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీల తీరు ఇలా ఉంటే.. కాంగ్రెస్ పార్టీ మాత్రం మేయర్ గెలుపు ఊసే […]