పెంపుడు కూతురు (1963) సినిమాలో ఎన్టీఆర్ కుస్తీ పహిల్వాన్గా కనిపిస్తారు. డూప్ లేకుండా గోదాలో కుస్తీ చేశారు. నిజంగానే ఎన్టీఆర్ బాడీ బిల్డర్లాగే ఉంటాడు. ఆ రోజుల్లో హీరోలు కథని , తమ పాత్రని నమ్మి సినిమా చేసేవాళ్లు. హీరోయిజం చూసుకునే వాళ్లు కాదు. అందుకే ANR మిస్సమ్మలో కమెడియన్గా వేసాడు. భీష్మలో ఎన్టీఆర్ ముసలి పాత్ర చేసాడు. ఇప్పటిలా భేషజాలు లేవు కాబట్టే వాళ్లు వందల సినిమాలు చేశారు. పెంపుడు కూతురులో టైటిల్ రోల్ దేవికది. […]