ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గత నెలాఖరు వరకు రాష్ట్రాన్ని వానలు ముంచెత్తాయి. కానీ ఇప్పుడు మళ్లీ ఎండలు మండిపోతున్నాయి. గత ఏడెనిమిది రోజుల నుంచి రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ఈ పరిస్థితికి రుతుపవనాల మందగమనమే కారణమని నిపుణులు అంటున్నారు. అయితే ఒకవైపు ఎండలు మండిపోతున్నా ఏపీతో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళలలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏపీలో అయితే గడిచిన నాలుగైదు రోజులుగా వర్షాభావ పరిస్థితులతో ఉష్ణోగ్రతలు బాగా పెరిగాయి. ముఖ్యంగా […]
మండుటెండలతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ కేంద్రం (ఐఎండీ) చల్లనివార్త చెప్పింది. ఈ ఏడాది నైరుతి ఆగమనం ఊహించని దానికంటే ముందే వచ్చినా.. దేశమంతా విస్తరించేందుకు ఎక్కువ సమయం తీసుకుంది. నేడు నైరుతి రుతుపవనాలు అరేబియా సముద్రతీరంలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమలో కొన్ని ప్రాంతాలతో పాటు కొంకణ్ ప్రాంతం మొత్తానికి విస్తరించనున్నట్లు ఐఎండీ తెలిపింది. అలాగే బీహార్, తమిళనాడు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు.. సబ్ […]
రెండు రోజులు కూడా కాలేదు. రాయలసీమ అభివృద్ధికి తాము కట్టబడి ఉన్నామని ప్రకటించారు. తిరుపతి ఉప ఎన్నికల నేపథ్యంలో ఆ నగరంలో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. రాయలసీమను అభివృద్ధి చేసేది బీజేపీనని ప్రకటించారు. అంతవరకూ బాగానే ఉంది..మరి అంతలోనే అమరావతి వెళ్లి తాము మూడు రాజధానులకు వ్యతిరేకం అంటూ ఎలా మాట్లాడతారూ అనే ప్రశ్న ఇప్పుడు బీజేపీ శ్రేణులనే సతమతం చేస్తోంది. సీమలో అలా..అమరావతిలో ఇలా అన్నట్టుగా రెండు నాలుకల […]
ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురు చూస్తున్న రాయలసీమలోని కరువు ప్రాంతాల ప్రజలకు జగన్ సర్కార్ తీయ్యని కబురు చెప్పింది. నీరు లేక బీడు వారిని పోలాల్లో జలకళలాడేలా చేసేందుకు వైసీపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాయలసీమలోని కరువు ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యాలు మెరుగుపరిచేందుకు ప్రత్యేకంగా కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఈ రోజు తీర్మానం చేసింది. ఈ తీర్మానం ప్రకారం ఏపీ రాయలసీమ డ్రాట్ మిటిగేషన్ ప్రాజెక్ట్ కార్పొరేషన్ డెవలెప్మెంట్ లిమిటెడ్ (ఏపీఆర్‌డీఎంపీసీడీఎల్) […]
“మొన్నటి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ప్రధాన కారణం రాయలసీమే” .. ఇది తాజాగా చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్య. రెండు రోజుల డిజిటల్ మహనాడు ముగింపు సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ మొన్నటి ఎన్నికల్లో పార్టీ పది శాతం తేడాతో ఓడిపోయిందన్నారు. ఇందులో రాయలసీమలోనే బాగా దెబ్బ పడిందని చెప్పారు. నిజమే రాయలసీమలోని నాలుగు జిల్లాల్లో టిడిపి గెలిచింది కేవలం మూడంటే మూడు సీట్లు మాత్రమే. కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాల్లోని 52 అసెంబ్లీ సీట్లలో టిడిపి గెలిచింది […]
ఒక విషయాన్ని పదిసార్లు పది మందితో చెప్పిస్తే నలుగురైనా నమ్ముతారని రాజకీయ నాయకులకు ఒక ఆశ… ఆ క్రమంలో ఒక్కోసారి ముందు వెనుక ఆలోచించకుండా ఫ్లోలో ఏదేదో చెప్పేస్తారు… ఈ పద్దతి కొత్త తరం నాయకులకు కొంత కలిసి వస్తుంది కానీ నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడికి అది కూడా సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రి పదవిలో ఉన్న నేతకు అనుకూలించకపోగా పలు ప్రశ్నలతో తలబొప్పి కట్టిస్తుంది… ఇది చదివిన వారిలో కనీసం 90 శాతం […]
ప్రత్యర్ధుల నుండి ప్రశంసలు అందుకుంటే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మొన్నేమో ఎంఎల్సీ బిటెక్ రవి. తాజాగా మాజీ ఎంపి జేసీ దివాకర్ రెడ్డి. ఇంతకీ విషయం ఏమిటంటే పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో జగన్మోహన్ రెడ్డి పై ఇద్దరి నుండి అభినందనలు అందుకున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే ఇద్దరు కూడా టిడిపిలో కీలక నేతలే. తాజాగా జేసీ మాట్లాడుతూ కరువు ప్రాంతాలకు నీటిని అందించేందుకు జగన్ చిత్తశుద్దితో కృషి చేస్తున్నట్లు జేసీ అభినందించారు. రాయలసీమ అభివృద్ధికి జగన్ […]
చంద్రబాబునాయుడు వ్యవహారం చూస్తుంటే అందరిలోను ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు బయటపడటం లేదు కానీ ప్రకాశం జిల్లా నేతల్లో మాత్రం తీవ్ర అసహనం మొదలైందని సమాచారం. ఇదంతా ఏ విషయంలో అంటే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలోనే. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచాలని జగన్మోహన్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని కేసీయార్ తో పాటు తెలంగాణాలోని ప్రతిపక్షాలన్నీ వ్యతిరేకిస్తున్న విషయం చూస్తున్నదే. అదే సమయంలో ఏపిలో జగన్ నిర్ణయానికి బిజెపి తప్ప రెండోపార్టీ […]
రాయల సీమ రతనాల సీమ అనే మాటను తరచూ వింటుంటాం. కవులు, కళాకారులు, రాజకీయ నేతలు, సినిమాల్లోనూ ఈ మాటను సందర్భానుసారం ఉపయోగిస్తుంటారు. అయితే ఈ తరం సీమలో కరువు తప్పా.. రతనాలు చూసింది తక్కువ. అయితే రాయలసీమ ఇప్పుడు కరువు సీమే కానీ ఒకప్పుడు రతనాల సీమ అనే ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కర్నూలు జిల్లాలో తాజాగా ఇద్దరికి రెండు వజ్రాలు లభించడం రాయల సీమ రతనాల సీమ అని రుజువవుతోంది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం […]
రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో మద్దతివ్వకపోతే చంద్రబాబునాయుడు సీమ ద్రోహిగా మిగిలిపోవటం ఖాయమేనా ? బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రెడ్డి చెప్పిన దాని ప్రకారమైతే అందరు అలాగే అనుకోవాల్సొస్తోంది. విష్ణు మీడియాతో మాట్లాడుతూ రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తాగు, సాగు నీరందించే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ స్కీమ్ విషయంలో చంద్రబాబు మౌనంగా ఉంటే కుదరదంటూ మండిపడ్డాడు. రాయలసీమ నీటి ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు ఎందుకు నోరు మెదపటం లేదంటూ నిలదీయటం గమనార్హం. మొత్తం మీద […]