iDreamPost
iDreamPost
రాయలసీమ ప్రజల గొంతు ఎండకుండా చూసే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్ధ్యాన్ని 44వేల క్యుసెక్కుల నుండి 80వేల క్యుసెక్కులకి పెంచుతూ G.O 203ని విడుదల చేసిన విషయం తెలిసిందే . అయితే ఈ GOపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెబుతు ట్రిబ్యునల్ ని ఆశ్రయిoచారు. దీనిపై ఆంద్రప్రదేశ్ అధికారులు కృష్ణ బోర్డు దగ్గర తమ వివరణ ఇవ్వడానికి కూడా సిద్దమయ్యారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు మాత్రం పోతిరెడ్డి పాడు విషయంపై తమ అభిప్రాయం చెప్పకుండా దాటవేస్తూ వస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు ఏకంగా ఈ విషయంపై ఎవ్వరూ స్పందించవద్దు అని ఆదేశించారు.
Also Read: బాబు మీ ఆత్మ ఏమైంది?పోతిరెడ్డిపాడు మీద ఎందుకు సూటిగా మాట్లాడటం లేదు?
అయితే అనూహ్యంగా చంద్రబాబు నిర్ణయానికి వ్యతిరేకంగా సి.యం జగన్ సొంత జిల్లా తెలుగుదేశం పార్టి మండలి సభ్యుడు బి.టెక్ రవి జగన్ కు మద్దతు పలికారు. రాయలసీమకి నీళ్లు ఇచ్చే విషయంలో ఎవరు ప్రయత్నించినా వారికి అండగా ఉంటానని, పోతిరెడ్డిపాడు విషయంలో సీఎం జగన్ విడుదల చేసిన జీవో 203ను సమర్థిస్తున్నానన్నారు. తెలుగుదేశంలో అనూహ్యంగా జరిగిన ఈ పరిణామం పై ఆ పార్టీ ముఖ్యనేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read:పోతిరెడ్డిపాడు కెపాసిటీ పెంచితే నిజంగా నష్టం జరుగుతుందా?