ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిజిస్ట్రార్ మరణంలో కొత్త విషయం వెలుగుచూసింది. బుధవారం రిజిస్ట్రార్ రాజశేఖర్ ఆకస్మికంగా మరణించారు. ఆయనకు గుండెపోటు రావడంతో చనిపోయారని అధికారులు తెలిపారు. అయితే ఈ రోజు మృతదేహానికి స్వాబ్ టెస్ట్ చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఒక్కసారిగా హైకోర్టులో కలకలం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ వరకూ హైకోర్టుకు సెలవు ప్రకటించారు. ఈ మేరకు నూతన రిజిస్ట్రార్ […]
యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ తో గీతా ఆర్ట్స్ సంస్థ ఓ సినిమా చేయబోతున్నట్టు గత కొద్ది రోజులుగా గట్టి ప్రచారమే జరుగుతోంది. చిరంజీవితో గతంలో ఉన్న విభేదాల దృష్ట్యా నిజంగా ఇది సాధ్యమవుతుందా అనే అనుమానాలు గట్టిగానే వ్యక్తమవుతున్నాయి. అసలు ఈ టాక్ రావడానికి కారణం ఉంది. గతంలో పలాస ప్రమోషన్స్ లో అతిథిగా వచ్చిన నిర్మాత అల్లు అరవింద్ ఆ దర్శకుడు కరుణ కుమార్ తో ఓ చిత్రం చేస్తానని పబ్లిక్ గానే చెప్పేశారు. దీంతో […]
స్టార్ హీరోలకు ఒక ఇమేజ్ అంటూ ఏర్పడ్డాక దానికి భిన్నంగా ఏదైనా ప్రయోగం చేసినప్పుడు అందులో రిస్క్ ఉంటుంది. అది సక్సెస్ అయ్యిందా ఓకే లేదా ఏ మాత్రం తేడా కొట్టినా దాని బాక్స్ ఆఫీస్ ఫలితం చాలా తేడాగా ఉంటుంది. చిరంజీవి లాంటి అగ్ర హీరో ఇలాగే రుద్రవీణ, ఆపద్బాంధవుడు, ఆరాధన లాంటి డిఫరెంట్ జానర్ సినిమాలు చేసినప్పుడు తిరస్కారం తప్పలేదు. కారణం అభిమానుల అంచనాలు పూర్తిగా తప్పడమే. అయితే యాంగ్రీ యంగ్ మ్యాన్ గా […]
కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లి 80,90 దశకంలోకి తొంగి చూస్తే సుమన్, రాజశేఖర్ లు ఇద్దరూ స్టార్లకు ధీటుగా యాక్షన్ హీరోలుగా మంచి మార్కెట్ కలిగినవాళ్ళే . విలన్ గా కెరీర్ మొదలుపెట్టి తర్వాత సపోర్టింగ్ రోల్స్ లో కనిపించి ఆపై అంకుశంతో తిరుగులేని బ్రేక్ తో పాటు యాంగ్రీ యంగ్ మ్యాన్ అని పేరు తెచ్చుకోవడం రాజశేఖర్ కే చెల్లింది. ఉద్రేకంతో కూడిన ఎమోషన్స్ ని మొహంలోనే చూపించడంలో ఇతను చూపించిన నేర్పు ఎందరో […]
నిన్న దేశవ్యాప్తంగా జనతా కర్ఫ్యూ దిగ్విజయంగా ముగిసింది. 5 గంటలకు చప్పట్లు కొట్టే కార్యక్రమం అయ్యాక కొన్ని నగరాల్లో కొందరు అత్యుత్సాహంతో, తెలిసి తెలియనితనంతో సంబరాలు చేసుకోవడం విమర్శలకు దారి తీసింది. ఇదిలా ఉండగా గత రెండు వారాలుగా స్తంభించిపోయిన సినిమా పరిశ్రమ మీద పడిన లక్షలాది కుటుంబాలకు అందులోనూ రోజువారీ భృతి మీద లేదా జీతాల మీద ఆధారపడ్డ వాళ్ళకు జీవనోపాధి చాలా కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో పలువురు నటులు దర్శకులు తీసుకుంటున్న చర్యలు […]