ప్రతి ఏడాది అంగరంగ వైభవంగా భక్తుల సమక్షంలో జరిగే భద్రాచల సీతారాముల కల్యాణ మహోత్సవంపై కరోనా ఎఫెక్ట్ పడింది. ఈ ఏడాది ఏప్రిల్ 2 న జరగాల్సిన సీతారాముల కల్యాణ మహోత్సవం భక్తులు లేకుండానే నిరాడంబరంగా జరగనుందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వెల్లడించారు. ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తున్న కరోనా దేశంలో కూడా వ్యాపించే అవకాశం ఉన్నందున వైరస్ వ్యాప్తిని అడ్డుకునే దిశగా పలు రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. అందులో భాగంగానే తెలంగాణాలో ప్రతీ […]