ఎదురు చూస్తున్న సుముహూర్తం వచ్చేసింది. తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు తెరుచుకోబోతున్నాయి. 30న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో మూవీ లవర్స్ కోసం గేట్లు తెరుచుకోబోతున్నాయి. పెద్ద సినిమాలు లేకపోయినా అసలు జనం మూడ్ ఎలా ఉందో తెలుసుకోవడానికి కొత్త రిలీజులు ఉపయోగపడుతున్నాయి. అందులో ప్రధానంగా పబ్లిక్ దృష్టి ఉన్నవి రెండే. ఒకటి సత్యదేవ్ తిమ్మరుసు. రెండు తేజ సజ్జ ఇష్క్. కాకతాళీయంగా ఇవి రెండూ రీమేక్ కావడం గమనార్హం. ఏపిలో పూర్తి స్థాయిలో హాళ్లు తెరుచుకోవడం అనుమానంగానే ఉంది. […]