విక్టరీ వెంకటేష్ ఇప్పటి జనరేషన్ కి ఫ్యామిలీ మూవీస్ హీరోగానే తెలుసు కానీ కెరీర్ ప్రారంభంలో మంచి సెన్సిబుల్ చిత్రాలు కొన్ని చేశారు. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రేమ. 1989లో రాజేశ్వరి ఫిలిమ్స్ బ్యానర్ పై రామానాయుడు గారు నిర్మించిన ఈ చిత్రం అప్పట్లో సూపర్ హిట్ గా నిలిచింది. ఇందులో ప్రత్యేకత స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించడం. సంగీతమే ప్రాణంగా బ్రతుకుతూ అందులోనే జీవితాన్ని స్థిరపరుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్న పృథ్వి అనే కుర్రాడు, సరదాగా లైఫ్ ని […]