“ఒక్కసారి పురాణాలు దాటి వచ్చి చూడు, అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలే తప్ప, హీరోలు, విలన్లు లేరీ నాటకంలో” ఈ వాక్యంతో ప్రారంభమయ్యే సినిమా ప్రస్థానం. 2010లో వచ్చిన ప్రస్థానం, రాజకీయాల్లో ఉన్న కొత్త కోణం, మనుషుల్ని నడిపించే అహాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేసింది. అయితే కొన్ని రోటీన్ సన్నివేశాలు, పాటలు , మూడు గంటల నిడివి సినిమా ఔచిత్యాన్ని దెబ్బతీశాయి. అయినా ఇది డిఫరెంట్ సినిమానే. అమెరికాలో చదువుకుని వచ్చిన దేవ్ కట్టా , […]