ప్రముఖ పాత్రికేయులు, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్, తొలితరం జర్నలిస్టులలో ఒకరైన పొత్తూరి వెంకటేశ్వరరావు (86) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయర ఇవాళ ఉదయం హైదరాబాద్ విజయనగర్ కాలనీలోని తన నివాసంలో కన్నుమూశారు. పత్రికారంగానికి 50 ఏళ్లకు పైగా సేవలందించిన పొత్తూరి తెలుగు జర్నలిజంలో తనదైన ముద్రలు వేసారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రెస్ అకాడమీ చైర్మన్గా సేవలందించారు. 1957లో ఆంధ్ర జనతా పత్రికతో పాత్రికేయ వృత్తి ప్రారంభించిన ఆయన ఈనాడు, ఆంధ్రప్రభ, ఆంధ్రభూమి, వార్తా […]