సామాజిక మాధ్యమం ట్విట్టర్ తో కేంద్రం తగాదా తారస్థాయికి చేరినట్టు కనిపిస్తోంది. ఇప్పటికే పలు అంశాలలో విబేధాలు బయటపడిన నేపథ్యంలో తాజా వ్యవహారం చర్చనీయాంశం అవుతోంది. ఈసారి కేంద్రం అడుగుముందుకేసి ఢిల్లీ పోలీసులతో ట్విట్టర్ కార్యాలయంలో తనిఖీలకు సిద్ధపడడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇటీవల పలు అంశాలలో ప్రధానంగా కోవిడ్ ఇండియన్ వేరియంట్ అని పేర్కొనడం వంటి విషయాల్లో కేంద్రం తన అభ్యంతరాలను బహిరంగంగానే వెల్లడించింది. సామాజిక మాధ్యమాలు కూడా స్పందించి దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నాయి. అయితే […]